కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తీవ్ర ఆవేశంతో ఊగిపోయారు. లఖింపూర్ ఖేరీ విషయంలో సిట్ వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు కోరినప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించాల్సిందిగా విలేకరులు కోరగానే.. విలేకరిని తోసేశారు.’మీరంతా దొంగలే’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లఖింపూర్ ఖేరీ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రే అని ఆ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ తేల్చి చెప్పడంతో రాజకీయంగా పెను దుమారం రేగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. ఆయన్ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ఈ విషయంపై లోక్సభలో వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు.