Microplastics | మేఘాల్లోకీ చేరిన మైక్రోప్లాస్టిక్.. పర్యావరణంపై ప్రభావం!
భూమిని మొత్తం ఆక్రమించేసిన మైక్రోప్లాస్టిక్స్ మేఘాల్లోకీ చేరాయని, ఇవి పర్యావరణాన్ని సైతం ప్రభావితం చేస్తుండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- శాస్త్రవేత్తల ఆందోళన
Microplastics | న్యూఢిల్లీ: భూమిని మొత్తం ఆక్రమించేసిన మైక్రోప్లాస్టిక్స్ మేఘాల్లోకీ చేరాయని, ఇవి పర్యావరణాన్ని సైతం ప్రభావితం చేస్తుండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆకాశంలో మైక్రోప్లాస్టిక్‌లు మంచు కేంద్రక రేణువులుగా పనిచేసి అసహజంగా మేఘాల ఏర్పాటుకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
సాధారణంగా మేఘాలు ఏర్పడే పరిస్థితులు లేకపోయినా మైక్రోప్లాస్టిక్‌లు మేఘాలు ఏర్పడేలా చేస్తాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిర్ధారించడం కోసం పరిశోధకులు నాలుగు రకాల మైక్రోప్లాస్టిక్‌లను ప్రయోగశాలలో పరీక్షించారు. ఇందుకోసం నీటి బిందువులను చల్లబరిచి మంచుగా మార్చారు. మైక్రోప్లాస్టిక్ లేని నీటి బిందువులు మైనస్ 38 డిగ్రీల సెల్సియస్ వద్ద గడ్డ కట్టగా, 50 శాతం మైక్రో ప్లాస్టిక్‌లతో కలుషితమైన నీటి బిందువులు మైనస్ 22 డిగ్రీల సెల్సియస్ వద్దనే గడ్డ కడుతున్నట్టు తెలుసుకున్నారు. కాబట్టి మైక్రో ప్లాస్టిక్లు మేఘాల నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్నాయని అర్ధమవుతున్నదని శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఫ్రీడ్మన్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

