Holi Festival | హోలీ పండుగ అంటేనే ఆడ, మగ అనే తేడా లేకుండా, పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు అందరూ ఎంజాయ్ చేసే పండుగ. రంగులు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ హోలీ( Holi )ని జరుపుకుంటారు. కానీ ఆ గ్రామంలో హోలీ పండుగకు పురుషులు దూరంగా ఉంటారు. కేవలం స్త్రీలు మాత్రమే హోలీ పండుగను జరుపుకుంటారు. మరి ఆ గ్రామం గురించి తెలుసుకోవాలంటే.. రాజస్థాన్( Rajasthan )లోని నగర్( Nagar Village ) గ్రామానికి వెళ్లాల్సిందే.
స్థానికుల కథనం ప్రకారం.. నగర్ గ్రామంలో ఇప్పటికీ పర్దా వ్యవస్థ( purdah system ) కొనసాగుతోంది. పాత రోజుల్లో హోలీ పండుగ రోజున మహిళలు బయటకు వస్తే హోలీ పండుగను ఆడేవారు కాదు. ఈ క్రమంలో మహిళలు కూడా హోలీ ఆడాలనే ఉద్దేశంతో.. ఆ రోజు పురుషులంతా గ్రామాన్ని వదిలి వెళ్లిపోతారు. ఐదు సంవత్సరాలు పైబడిన అబ్బాయిల నుంచి మొదలుకొంటే వృద్ధ పురుషుల వరకు ఆ రోజు గ్రామంలో ఎవరూ ఉండరు. స్థానికంగా ఉన్న ఆలయంలోనే హోలీ రోజున 5 గంటల పాటు బస చేస్తారు. దారితప్పి ఒక వేళ పురుషులు ఊర్లోకి ప్రవేశిస్తే.. కొరడా దెబ్బలు తినక తప్పదు. హోలీ ఆడే మహిళల్లో కొందరు పురుషుల వేషధారణల్లో ప్రత్యక్షమై రంగుల పండుగను కలర్ఫుల్గా నిర్వహిస్తారు. ఈ ఆచారం గత 400 ఏండ్ల నుంచి అమలవుతుందని స్థానికులు తెలిపారు.