న్యూఢిల్లీ, ఆగస్టు 14: సుమారు 610 కిలోల బరువుతో ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ బిన్ మోహ్సేన్ షరీ బరువు ఇప్పుడు 63.5 కేజీలు. అత్యంత భారీ కాయంతో బరువు కారణంగా మూడేండ్లకు పైగా ఖలీద్ మంచానికే పరిమితమయ్యాడు. అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం, వైద్యానికి ఖర్చు ఎక్కువ కావడంతో దానిని భరించలేకపోయాడు. ఈ క్రమంలో అతడి పరిస్థితిపై సౌదీ అరేబియా మాజీ రాజు అబ్దుల్లా స్పందించి అతనికి వైద్య సహాయాన్ని అందించారు. నిపుణులైన 30 మంది వైద్యులను ఏర్పాటు చేశారు. వారి పర్యవేక్షణలో డైట్ నిబంధనలతో పాటు పలు సర్జరీలు చేయడంతో ఆరు నెలల్లోనే తన బరువును సగానికి తగ్గించుకున్నాడు. 2023 నాటికి అతని బరువు 542 కేజీలు తగ్గి 63.5కిలోలకు తగ్గడంతో ఇప్పుడు చలాకీగా తన పనులు చేసుకుంటున్నాడు.