శుక్రవారం 03 జూలై 2020
National - Apr 05, 2020 , 08:49:03

పూల వ‌ర్షంతో పోలీసుల‌కు సెల్యూట్..వీడియో

పూల వ‌ర్షంతో పోలీసుల‌కు సెల్యూట్..వీడియో

 మీర‌ట్‌: క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు దేశ‌వ్యాప్తంగా పోలీసులు చేస్తున్న సేవ‌లను ఎంత ప్ర‌శంసించినా త‌క్కువే. ఎందుకంటే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పోలీసులు త‌మ కుంటుంబాల‌ను వ‌దిలిపెట్టి ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం రోడ్ల‌పై నిద్రాహారాలు మానేసి..విధులు నిర్వ‌ర్తిస్తూ దేశ‌సేవ‌కు అంకిత‌మ‌వుతున్నారు.

యూపీ వాసులు ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తోన్న పోలీసుల‌ను  గొప్పగా స‌త్క‌రించారు. మీర‌ట్ వాసులు వాహ‌నాల్లో వ‌స్తున్న పోలీసులపైకి పూల వ‌ర్షం కురిపించారు. పోలీసులు వ‌స్తున్న దారి పొడ‌వునా మీర‌ట్ ప్ర‌జ‌లు పూలు జ‌ల్లుతూ..స‌మాజానికి పోలీసులు చేస్తోన్న సేవ‌ల‌ను కొనియాడారు. పోలీసుల ప‌ట్ల మీర‌ట్ వాసులు చూపిస్తున్న ప్రేమాభిమాలు ఎంతోమందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో ఆన్ లైన్ లో వైర‌ల్ అవుతోంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo