ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కేసు : కాంగ్రెస్ పై బీజేపీ మహిళా ఎంపీ ఆరోపణలు

న్యూఢిల్లీ : ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అక్రమంగా నిల్వ చేసిన కేసులో నిందితుడు, రెస్టారెంట్ల యజమాని నవనీత్ కల్రాకు కాంగ్రెస్ నేతలతో సంబంధాలున్నాయని బీజేపీ నేత, న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి ఆరోపించారు. బ్లాక్ మార్కెట్ వ్యాపారులు, అక్రమ లావాదేవీలు చేపట్టే వారితో కాంగ్రెస్ కుమ్మక్కవుతుందని ఆమె మండిపడ్డారు. రూ 13 కోట్ల విలువైన 7500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సీజ్ చేసిన కేసులో నవనీత్ కల్రా నిందితుడని ఆయనకు కాంగ్రెస్ తో నేరుగా సంబంధాలున్నాయని చెప్పారు.
ఆక్సిజన్ కొరతపై రాహుల్ గాంధీ ఆయన స్నేహితులు గగ్గోలు పెడుతున్నారని మరోవైపు నిందితుడి రెస్టారెంట్ చెఫ్ రాహుల్, సోనియా గాంధీలతో ఫోటోలు దిగారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో 2005-06లో నవనీత్ కల్రాకు ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ సభ్యత్వం ఇప్పించారని ఆరోపించారు. బ్లాక్ మార్కెటీర్లు, దళారీలతో కాంగ్రెస్ అంటకాగేందుకు ఆ పార్టీ నేత అభిషేక్ మను సింఘ్వీ మధ్యవర్తిత్వం నెరపుతారని మీనాక్షి లేఖి ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- block market
- Congress
- Covid-19
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

