Mayawati | మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను.. వారసుడిగా తిరిగి నియమించిన మాయావతి
Mayawati | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తిరిగి నియమించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అతడికి అప్పగించారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను తిరిగి నియమించారు. పార్టీ జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా అతడికి అప్పగించారు. ఆదివారం లక్నోలో జరిగిన పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. 2019లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో తెగతెంపులు చేసుకున్న తర్వాత పార్టీ పటిష్టంపై మాయావతి దృష్టిసారించారు. మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమించారు. గత ఏడాది డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా అతడ్ని ఎంపిక చేశారు.
కాగా, ఈ ఏడాది మే నెలలో మాయావతి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జాతీయ కోఆర్డినేటర్ పదవి నుంచి, వారసుడిగాను ఆకాష్ ఆనంద్‌ను తొలగించారు. రాజకీయ పరిపక్వత వచ్చే వరకు ఆ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బీఎస్పీ నేతలు ఆశ్చర్యపోయారు.
మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ 10 సీట్లు దక్కించుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను మరోసారి జాతీయ సమన్వయకర్తగా నియమించడంతోపాటు తన వారసుడిగా మాయావతి ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Akash Anand
- BSP
- Mayawati
- nephew
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

