న్యూఢిల్లీ, నవంబర్ 25: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ సంస్థలు ఉద్యోగాల కోతను అమలుజేస్తుండగా, మరో దిగ్గజ సంస్థ ‘యాపిల్’ కూడా అదే బాటలో ఉన్నట్టు తెలిసింది. యాపిల్ కేంద్రాల్లో పనిచేస్తున్న సేల్స్, మేనేజర్లు, ఇతర సిబ్బందిని తగ్గిస్తున్నట్టు ఆ కంపెనీ తాజాగా వెల్లడించింది. అయితే ఉద్యోగాల కోత ఎంతన్నది స్పష్టం చేయలేదు. సేల్స్ టీమ్‌ల్లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న వారిని, యాపిల్ కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది, అకౌంట్స్ మేనేజర్లపైనా లేఆఫ్ ప్రభావం పడుతుందట. అమెరికాలో ఇటీవల 43 రోజులుగా కొనసాగిన షట్‌డౌన్ ప్రభావం యాపిల్ అమ్మకాలపై పడింది.