Nanded | నాందేడ్‌లో పరువు హత్య.. ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకున్న ప్రియురాలు
Nanded | వేరే కులం వాడని, పరువు పోతుందని తండ్రి, సోదరుడు ప్రియుని ప్రాణాలు తీయగా, ప్రాణం పోయినా అతనే తన భర్త అంటూ ఒక యువతి అతడి మృతదేహాన్ని వివాహం చేసుకుంది.
Nanded | ముంబై, నవంబర్ 29: (నమస్తే తెలంగాణ) : వేరే కులం వాడని, పరువు పోతుందని తండ్రి, సోదరుడు ప్రియుని ప్రాణాలు తీయగా, ప్రాణం పోయినా అతనే తన భర్త అంటూ ఒక యువతి అతడి మృతదేహాన్ని వివాహం చేసుకుంది. ఇక జీవితాంతం ప్రియుడి ఇంట్లోనే ఉండేందుకు నిర్ణయించుకుంది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ నగరంలోని జునాగంజ్ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక జునాగంజ్ ప్రాంతానికి చెందిన సక్షం టేట్, ఆంచల్ మామిడివార్ ప్రేమించుకున్నారు.
ఇటీవల ఆంచల్ కుటుంబానికి ప్రేమ వ్యవహారం తెలిసింది. ఇరువురి కులాలు వేర్వేరు అని, తన సోదరితో మాట్లాడవద్దని ఆంచల్ సోదరుడు.. సక్షం టేట్‌ను హెచ్చరించారు. తర్వాత అతడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. గురువారం ఆంచల్ తండ్రి గజానన్, సోదరులు సాహిల్, హిమేష్, తమ ఇద్దరు స్నేహితులతో కలిసి సక్షం టేట్‌ను హత్య చేశారు. అయితే ప్రియుడిని చంపి తన తండ్రి, సోదరులు గెలిచామని భావిస్తున్నారని, చనిపోయినా, బతికున్నా అతడే తన భర్తని పేర్కొన్న ఆంచల్.. సక్షం టేట్ మృతదేహాన్ని వివాహమాడింది. ఇక నుంచి అతని ఇల్లే తన ఇల్లని, అక్కడే ఉంటానని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

