ఇంఫాల్, జూన్ 8: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో శనివారం కొందరు అనుమానిత మిలిటెంట్లు ఓ పోలీసు ఔట్ పోస్టుతో సహాపలు ఇండ్లకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పలు ఇండ్లు కాలిపోయానని, అయితే కచ్చితమైన సంఖ్య తెలియదని ఓ అధికారి పేర్కొన్నారు.
రాత్రి సమయాన్ని ఆసరాగా చేసుకొని మిలిటెంట్లు జిల్లాలోని లంతాయ్ ఖునౌ, మోధుపూర్ ప్రాంతాల్లో దాడులు కూడా చేశారని అధికారులు వెల్లడించారు. తాజా హింస నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మిలిటెంట్ వ్యతిరేక ఆపరేషన్లలో స్థానిక బలగాలకు సహకరించేందుకు మణిపూర్ పోలీసు శాఖకు చెందిన కమాండో దళం జిరిబామ్‌కు తక్షణంగా తరలించారు.