Man Stabs 3 In Hospital | హాస్పిటల్లో భార్య, కుమార్తె, మరో వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన వ్యక్తి
Man Stabs 3 In Hospital | ఒక వ్యక్తి ఉన్నాదిగా ప్రవర్తించాడు. హాస్పిటల్లో భార్య, కుమార్తెతోపాటు మరో వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. పోలీసులతోపాటు మరి కొందరిపై కత్తితో దాడి చేశాడు. చివరకు అతికష్టం మీద ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటానగర్: ఒక వ్యక్తి ఉన్నాదిగా ప్రవర్తించాడు. హాస్పిటల్లో భార్య, కుమార్తెతోపాటు మరో వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. (Man Stabs 3 In Hospital) పోలీసులతోపాటు మరి కొందరిపై కత్తితో దాడి చేశాడు. చివరకు అతికష్టం మీద ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కమెంగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్పాలోని జిల్లా ఆసుపత్రిలో 40 ఏళ్ల నికమ్ సంగ్బియా చెలరేగిపోయాడు. ప్రస్తుతం ఎక్కడా కనిపించని సాంప్రదాయక కత్తి ‘దావో’తో భార్య, కుమార్తె, మరో వ్యక్తిపై దాడి చేశాడు. కత్తితో పలుమార్లు పొడిచి వారిని చంపాడు. అక్కడున్న మరికొందరిపై కత్తితో దాడి చేసి గాయపర్చాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ హాస్పిటల్కు చేరుకున్నారు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా నికమ్ ఆ కత్తితో దాడి చేశాడు. దీంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. చివరకు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాయపడిన వారిని మరో హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

