Viral News | ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) కు చెందిన ఓ యువకుడు పోలీసులకు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాష్ట్రంలోని సంభల్ (Sambhal) జిల్లాకు చెందిన అసద్ ఖాన్ (Asad Khan) భార్య నిండు గర్భిణి. గత ఆదివారం పురుటి నొప్పులతో చందౌసిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోం (private hospital )లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆసుపత్రిలో విపరీతంగా ఉన్న దోమలు (mosquitoes) అసద్ భార్య, నవజాత శిశువును తీవ్రంగా కుట్టడంతో చిన్నారి ఏడవడం మొదలుపెట్టింది. వారి బాధను చూడలేని అసద్.. ఏం చేయాలో తెలియక మస్కిటో కిల్లర్ (Mosquito killer) కోసం బయటకు వెళ్లాడు. అయితే, అర్ధరాత్రి సమయం కావడంతో షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఓ వినూత్న ఆలోచన చేశాడు. మస్కిటో కిల్లర్ (Mosquito killer) కావాలంటూ ఏకంగా యూపీ పోలీసులకు (Up Police) ట్వీట్ (Tweet) చేశాడు. ‘దోమలు కుట్టి నా భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారు. మస్కిటో కిల్లర్ (Mosquito killer) కావాలి’ అంటూ అభ్యర్థించాడు. డయల్ 112 ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశాడు. అసద్ అభ్యర్థనకు యూపీ పోలీసు (Up Police)లు వెంటనే స్పందించారు. ఆసుపత్రికి చేరుకుని మస్కిటో కిల్లర్ (Mosquito killer) ను అతనికి అందించారు.
‘माफिया से लेकर मच्छर तक का निदान’ –
नर्सिंग होम में अपने नवजात शिशु और प्रसूता पत्नी को मच्छरों से राहत देने के लिये एक व्यक्ति द्वारा ट्वीट कर मदद की अपील की गयी। #UP112 PRV 3955 ने त्वरित कार्यवाही कर नर्सिंग होम में मॉस्किटो क्वॉइल पहुँचाया।#UPPCares@sambhalpolice pic.twitter.com/WTrK7o8bhY
— UP POLICE (@Uppolice) March 20, 2023
Also Read..
Rahul Gandhi | రాహుల్ గాంధీకి రెండేండ్ల జైలు శిక్ష
Google Job Cuts | ఉద్యోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి.. సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల లేఖ..!
Dima Nova | తన పాటతో పుతిన్‌పై వ్యతిరేకత వ్యక్తం చేసిన రష్యన్ పాప్ స్టార్ మృతి