Man Rapes Cow | ఆవుపై అత్యాచారం.. వ్యక్తి అరెస్ట్
Man Rapes Cow | ఒక వ్యక్తి అసహజంగా శృంగారం చేశాడు. ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Man Rapes Cow) ఆవు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. గతంలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా నిందితుడిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు.
జైపూర్: ఒక వ్యక్తి అసహజంగా శృంగారం చేశాడు. ఆవుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (Man Rapes Cow) ఆవు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. గతంలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడినట్లుగా నిందితుడిపై కేసులు ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బరోడామియో గ్రామానికి చెందిన రాహుల్‌పై ఈశ్వర్ యాదవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తన ఇంటి బయట ఉన్న ఆవుపై అతడు అత్యాచారం చేసినట్లు ఆరోపించాడు. అల్వార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేవారు. ప్రాథమిక విచారణ అనంతరం రాహుల్‌ను అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
కాగా, నిందితుడు రాహుల్ ఇప్పటికే రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో రెండుసార్లు అరెస్టైనట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పోక్సోతోపాటు పలు సెక్షన్ల కింద అతడిపై రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రెండుసార్లు జైలుకెళ్లిన అతడు విడుదలైనట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- booked
- Cow
- MAN
- Rajasthan's Alwar
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

