లక్నో: ఒక వ్యక్తి తన భార్యతో గొడవ పడ్డాడు. జోక్యం చేసుకుని సర్దిచెప్పేందుకు తల్లి ప్రయత్నించింది. దీంతో ఆగ్రహించిన అతడు ఈటెతో పొడిచి తల్లిని చంపాడు. (Man Kills Mother) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నిగోహి పోలీస్ స్టేషన్ పరిధిలోని గణపత్‌పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల వినోద్ మద్యం సేవించి తరచుగా భార్యతో గొడవపడేవాడు. మార్చి 6న సాయంత్రం అతడు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవపడి ఆమెను కొట్టాడు.
కాగా, వినోద్ తల్లైన 60 ఏళ్ల నైనా దేవి, భార్యాభర్తల మధ్య గొడవలో జోక్యం చేసుకున్నది. వారిద్దరికి సర్దిచెప్పేందుకు ఆమె ప్రయత్నించింది. అయితే ఆగ్రహించిన వినోద్ ఈటెతో పొడిచి తల్లిని హత్య చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. నైనా దేవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిని హత్య చేసిన నిందితుడు వినోద్‌ను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.