న్యూఢిల్లీ : లింక్డిన్లో ఉద్యోగ ప్రయత్నాలు విఫలం కావడంతో దుబాయ్‌కు చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా ఉద్యోగ వేట ప్రారంభించాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కనిపించిన వారందరికీ రెజ్యూమ్‌లు అందచేస్తున్నాడు. తన రెజ్యూమ్‌తో పాటు చాక్లెట్ బార్లు అందిస్తూ నాకు ఉద్యోగం ఇప్పించగలిగితే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని రాసిన ఓ నోట్‌నూ జత చేశాడు.
నోట్‌పై ఆ వ్యక్తి పేరు, చిరునామా రాసిఉన్నాయి. దుబయ్ మరిన వద్ద ఆ వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద తచ్చాడుతూ కనిపించాడు. నవార్ ఎం అనే వ్యక్తి తన వివరాలను లింక్డిన్ పోస్ట్‌లో ప్రస్తావించారు. నవార్ సీవీ ప్రకారం అతడు అల్ జర్ఖా యూనివర్సిటీలో చదవగా, తనకు అరబిక్, ఇంగ్లీష్ మాట్లాడటం తెలుసని, సేల్స్ మెన్‌గా చాలా సంవత్సరాల అనుభవం ఉందని రాసుకొచ్చాడు. లింక్డిన్లో ఉద్యోగ ప్రయత్నాలు విఫలమైన తర్వాత దుబాయ్ సిగ్నల్స్ వద్ద తన సీవీని పంచడం ప్రారంభించానని లింక్డిన్ పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు.