Crime news | సోదరి తల తెగనరికి చేతిలో పట్టుకుని తిరిగిన యువకుడు.. యూపీలో దారుణం
Crime news | నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. కులం కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుని లేచిపోయిందనే కోపంతో ఓ యువకుడు తన సోదరి తల తెగనరికి.. ఆ తలను చేతిలో పట్టుకుని తిరిగాడు.
బారాబంకీ: నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. కులం కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుని లేచిపోయిందనే కోపంతో ఓ యువకుడు తన సోదరి తల తెగనరికి.. ఆ తలను చేతిలో పట్టుకుని తిరిగాడు. యూపీలోని బారాబంకీ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ జిల్లాకు చెందిన ఓ యువతి.. తన సామాజిక వర్గం కాని వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. ఈ విషయంలో గొడవలు జరగడంతో అతనితో కలిసి లేచిపోయింది. దాంతో ఆగ్రహించిన ఆమె సోదరుడు రియాజ్ (24) ఆ యువతిని వెతికిపట్టుకుని దారుణంగా హత్యచేశాడు. మొండెం నుంచి తలను వేరు చేయగడమేగాక.. ఆ తలను చేతిలో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రియాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కులంకానీ వ్యక్తితో లేచిపోయినందుకే తాను ఈ ఘాతుకానికి ఒడిగట్టానని పోలీసుల ప్రాథమిక విచారణలో రియాజ్ తెలిపాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

