లక్నో: గ్రామంలోకి ప్రవేశించిన పెద్ద మొసలి సుమారు నెల రోజులుగా గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది. చివరకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆ మొసలిని పట్టుకున్నారు. అయితే తాళ్లతో కట్టేసిన ఆ భారీ మొసలిని ఒక వ్యక్తి తన భుజంపై మోశాడు. (Man Carries Crocodile) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నెల రోజుల కిందట పౌతియాఖుర్ద్ గ్రామంలోని చెరువులో మొసలి కనిపించింది. దీనిని చూసి గ్రామస్తులు భయాందోళన చెందారు. నీటి కోసం ఆ చెరువు వద్దకు వెళ్లడం మానుకున్నారు. అలాగే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆ మొసలి కదలికలను గుర్తించారు. 20 అడుగుల పొడవు, 150 కిలోల బరువున్న భారీ మొసలిని చివరకు పట్టుకున్నారు. దాని కాళ్లు, నోటిని తాళ్లతో కట్టేశారు. మరోచోటుకు దానిని తరలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖకు చెందిన ఒక వ్యక్తి ఆ భారీ మొసలిని తన భుజంపై మోశాడు. గ్రామస్తులు చాలా ఆసక్తిగా దీనిని చూశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मगरमच्छ को कंधे पर लादकर ले जाते युवक का वीडियो सोशल मीडिया पर तेजी से हो वायरल !!
बीते तीन हफ्ते से गांव में दहशत फैलाए था विशालकाय मगरमच्छ !!
तीन हफ्ते की कड़ी निगरानी के बाद वनविभाग की टीम और एक्सपर्ट लोगों ने मगरमच्छ को पकड़ा !!
हमीरपुर का वायरल वीडियो !!#ViralVideo… pic.twitter.com/jKT6eJxUjX— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) November 26, 2024