Mamata Banerjee | బెంగాల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వం : మమతా బెనర్జీ
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో విపక్ష ఇండియా కూటమి ఇబ్బందులు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే సీపీఎంతో కాంగ్రెస్ తెగదెంపులు చేసుకోవాలని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హస్తం పార్టీకి షరతు విధించారు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో విపక్ష ఇండియా కూటమి ఇబ్బందులు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే సీపీఎంతో కాంగ్రెస్ తెగదెంపులు చేసుకోవాలని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హస్తం పార్టీకి షరతు విధించారు. సీట్ల సర్దుబాటు చర్చల సందర్భంగా తాను కాంగ్రెస్‌కు రెండు సీట్లు ఇవ్వచూపితే తిరస్కరించారని, ఇక ఇప్పుడు తాను ఒక్క సీటు కూడా ఇచ్చేది లేదని దీదీ స్పష్టం చేశారు.
గతంలో సీపీఎం తనపై పలుమార్లు భౌతిక దాడులు చేసిందని, తనను నిర్ధాక్షిణ్యంగా కొట్టారని, శ్రేయోభిలాషుల ఆశీస్సులతోనే తాను బతికి బయటపడ్డానని దీదీ గుర్తుచేశారు. లెఫ్ట్‌ను తాను ఎన్నడూ మన్నించనని, సీపీఎంను అసలు విడిచిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు సీపీఎంతో జట్టు కట్టినవారిని తాను మరువనని అన్నారు.
మమతా బెనర్జీ బుధవారం మాల్ధాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌కు రెండు లోక్‌సభ స్ధానాలు ఇచ్చి వారిని గెలిపించుకుంటానంటే వారు ఎక్కువ స్ధానాలను కోరుకున్నారని, మీరు లెఫ్ట్‌తో జట్టుకడితే తాను వారికి ఒక్క సీటు కూడా ఇవ్వనని చెప్పానని దీదీ తేల్చిచెప్పారు. ఇక బెంగాల్లో సీపీఎంతో పొత్తు ఉండబోదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో వెల్లడించారు. బీజేపీ, టీఎంసీతో పోరాడేందుకు లెఫ్ట్, కాంగ్రెస్‌తో పాటు లౌకిక పార్టీలు కలిసివస్తాయని ఆయన పలుమార్లు పేర్కొన్నారు.
Read More :
DK Shivakumar | జేడీ(ఎస్)ను దాదాపుగా బీజేపీలో విలీనం చేశారు: డీకే శివకుమార్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
Parveta Utsavam | తిరుమలలో ఘనంగా శ్రీమలయప్పస్వామివారి పార్వేట ఉత్సవం
Scene | ‘సీన్’ ప్రమోషన్స్ టైం.. సూర్య టీం ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసిందో తెలుసా..?
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!

