Mamata Banerjee | టీఎంసీలో మహిళలకు 38 శాతం ప్రాతినిధ్యం : మమతా బెనర్జీ
Mamata Banerjee : ఎన్నికైన ఎంపీల్లో 38 శాతం మంది మహిళలున్న ఏకైక పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు.
Mamata Banerjee : ఎన్నికైన ఎంపీల్లో 38 శాతం మంది మహిళలున్న ఏకైక పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీయేనని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎన్నికలకు ముందు చాలామంది చెప్పినా ఆ దిశగా వారెవరూ అడుగులు వేయలేదని అన్నారు.
38 శాతం మహిళా ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు చేపట్టినది కేవలం తమ పార్టీ మాత్రమేనని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. కోల్‌కతాలో ఆదివారం జరిగిన టీఎంసీ ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ బీజేపీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో అఖిలేష్ సాధించిన ఫలితాలకు తాను ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
యూపీలో మీరు ఇచ్చిన షాక్‌కు కాషాయ పాలకులు రాజీనామా చేయాల్సి ఉందని, కానీ వారు నిస్సిగ్గుగా పదవుల్లో కొనసాగుతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ఏజెన్సీలతో సహా వీలైనంతగా అన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు. ఉత్తర బెంగాల్లో తాము మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోయామని, రానున్న రోజుల్లో అక్కడ కూడా విజయం సాధిస్తామని దీదీ ధీమా వ్యక్తం చేశారు.
Read More :
Gorati Venkanna | దాశరథి ఉద్యమ ప్రస్థానం స్ఫూర్తిదాయకం : గోరటి వెంకన్న
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

