Train Accidents | మోదీ సర్కార్‌పై జనాగ్రహం తప్పదు : ఖర్గే వార్నింగ్
Train Accidents : ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు.
Train Accidents : ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం రైలు ప్రమాదాలను నివారించే దిశగా చర్యలు చేపట్టకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. రైల్వే శాఖలో ఎన్నో ఖాళీలున్నాయని, కీలక సాంకేతిక విభాగంలో ఖాళీలను భర్తీ చేయకుంటే రైల్వేలు సహజంగానే నిర్వీర్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రైల్వే శాఖ బలహీనపడటంతోనే రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. రైల్వేలు నీరుగారడంతోనే రైలు ప్రమాదాలు ఒకదాని వెంట ఒకటి జరుగుతున్నాయని పేర్కొన్నారు. రైల్వేలకు సకాలంలో నిధులు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. వందలాది ప్రాణాలు రైల్వే ప్రమాదంలో గాలిలో కలిసిపోతున్నాయని, దీని గురించి ప్రభుత్వం ఆలోచించకుంటే ప్రజలే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఖర్గే హెచ్చరించారు.
ఇక ఇటీవల యూపీలోని గోండా వద్ద చండీఘఢ్-దిబ్రూఘఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ముగ్గురు మరణించగా, 30 మందికి గాయాలయ్యాయి. ఇక ఆదివారం మధుర ట్రాక్‌పై ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇతరులతో చర్చించకుండా బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా బడ్జెట్ రూపొందిస్తోందని ఖర్గే ఆరోపించారు. బీజేపీ తమ ఆలోచనల గురించి ఎవరితో పంచుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తోందని, బడ్జెట్ విషయంలో రాష్ట్రాల సూచనలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
Read More :
Sushmita Sen | నేను ఇప్పుడు రిలేషన్లో లేను : సుస్మితా సేన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

