ముంబై: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావాణీ గాయని, పద్మశ్రీ అవార్డు గ్రహీత సులోచనా చవాన్ (92) ఇక లేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఆమె.. ఇవాళ దక్షిణ ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. సులోచన చవాన్ కుటుంబసభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు.
సులోచనా చవాన్ మరణవార్త తెలియగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. సులోచన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రతిపక్ష నేత అజిత్ పవార్ కూడా సింగర్ సులోచనా చవాన్‌కు నివాళులు అర్పించారు.