‘మహారాష్ట్ర రానివ్వం’.. ఎంపీ నవనీత్ రాణాకు బెదిరింపులు
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామంటూ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారంటూ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మహారాష్ట్రకు రానివ్వను.. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే చంపేస్తా.. ఓ నంబర్ నుంచి తనకు 11 సార్లు కాల్ వచ్చింది’ అని పేర్కొన్నారు.
బెదిరింపులతో తాను భయాందోళనకు గురయ్యాయనని ఢిల్లీ నార్త్ అవెన్యూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపులకు పాల్పడ్డ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నవనీత్ డిమాండ్ చేశారు. స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా, శివసేన మధ్య గతకొంతకాలంగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నవనీత్ రాణాతో పాటు ఆమె భర్త రవి రాణా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేయనున్నట్లు ప్రకటించారు.
ఆ తర్వాత శివసేన కార్యకర్తలు ఆమె ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం మహారాష్ట్ర పోలీసులు రాణా దంపతులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. రెచ్చగొట్టె ప్రకటనలు చేశారని, సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారంటూ అభియోగాల అభియోగాలు మోపడంతో పాటు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ముంబై సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

