Covid-19 | మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్‌కు సంకేతమా?
ముంబై : మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జూన్ నెల ప్రారంభం నుంచి రోజుకు వెయ్యికిపైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం 1,357 కొత్త కేసులు రికార్డవగా.. ఒకరు వైరస్‌తో మృతి చెందారు. కేసులు భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కరోనా ఫోర్త్ వేరియంట్‌కు సంకేతమా? అనే భయాందోళనలు చెందుతున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమై, వైరస్‌ను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. అయితే, కరోనా కేసులు పెరుగుతున్నా.. మరణాల రేటు ఎక్కువగా లేనందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే ఆదివారం పేర్కొన్నారు.
ఇదిలా ఉండా.. రెండు రోజుల కిందట సర్కారు బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బస్సులు, రైళ్లు, సినిమా హాళ్లు, ఆడిటోరియంలు, ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం కేసులు ముంబై, థానే, రాయ్‌గఢ్, పాల్ఘర్తో సహా పలు జిల్లాల్లోనే కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే ఇటీవల తెలిపారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో శనివారం 889 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
మూడు నెలల తర్వాత ఇంత మొత్తంలో కొత్త కేసులు రికార్డవగా ఇదే తొలిసారి. కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు లేఖ రాశారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైతే ముందు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ఇవాళ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కొవిడ్ బారినపడ్డారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కరోనా బారినపడ్డారు. అలాగే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, కార్తీక్ ఆర్యన్లతో సహా పలువురు తారలు వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు.
ప్రముఖ బాలీవుడ్ బడా ప్రొడ్యూస్ కరణ్ జోహార్ 50వ పుట్టిన వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న దాదాపు 50 మంది వైరస్ బారినపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇవాళ దేశంలో కొత్తగా 4,270 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ద100 పరీక్షలలో 10 మరణానంతర ఇన్ఫెక్షన్కు పాజిటివ్‌గా తేలినందున కేరళ కూడా ఆందోళన చెందుతోంది.ంతో మొత్తం కేసుల సంఖ్య 4,31,76,817కు చేరింది. అయితే, 34 రోజుల తర్వాత రోజువారీ పాజిటివిటీ రేటు ఒక శాతం కంటే ఎక్కువగా నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

