‘మహా’ సంక్షోభం.. ముంబైలో 144 సెక్షన్ విధింపు
ముంబై : మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. సంక్షోభం నేపథ్యంలో శివసేన జాతీయ కార్యవర్గం సమావేశమైంది. సమావేశంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. అయితే, అంతకు ముందు పుణేలోని ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే తానాజీ సావంత్ ఇల్లు, కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ముంబైలో 144 సెక్షన్ విధించారు. అలాగే ఏక్నాథ్ షిండే థానే నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
గౌహతిలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం సమావేశమైంది. శివసేనకు చెందిన 38 మంది రెబల్ ఎమ్మెల్యేలు, 10 మంది స్వతంత్రులు క్యాంప్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై ఎలాంటి స్పష్టత రాలేదు. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశం అనంతరం 38 మంది ఎమ్మెల్యేల జాబితాను ఏక్నాథ్ షిండే విడుదల చేశారు. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కూల్చేందుకు షిండేకు కేవలం 37 శివసేన ఎమ్మెల్యేలు మాత్రమే అవసరం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

