Maharashtra | మహారాష్ట్రలో రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ.. 56 లక్షల మంది రైతులకు లబ్ధి
Maharashtra : మహారాష్ట్రలోని రైతులకు ఊరట కలిగేలా దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని మహారాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
Maharashtra : మహారాష్ట్రలోని రైతులకు ఊరట కలిగేలా దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని మహారాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ‘పుణ్యశ్లోక్ అహిల్యాదేవి హోల్కర్ షేట్కారి కర్జ్ముక్తి యోజన’ పథకం కింద ఈ మాఫీ జరగనుంది. ఈ నిర్ణయం వల్ల మహారాష్ట్రలోని 56 లక్షల మంది రైతులకు మేలు జరగనుంది. దీనివల్ల మొత్తం 65 లక్షల వరకు రుణాలు మాఫీ అవుతాయి.
ఇందుకోసం ప్రభుత్వం రూ.36,585 కోట్లు కేటాయించనుంది. ఒకవేళ రైతులు ఇప్పటికే రుణాలు చెల్లించి ఉంటే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి రూ.50 వేల వరకు సాయం అందనుంది. అసలు, వడ్డీ కలిపి రూ.2 లక్షల వరకు రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయి. ఇందుకోసం భూయాజమాన్య డాక్యుమెంట్లు వంటివేమీ అక్కర్లేదు. రూ.2 లక్షలకు మించి రుణాలు ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే, వారు అదనపు డబ్బు ముందుగానే బ్యాంకులకు చెల్లించాలి. అంటే రూ.2 లక్షలకంటే ఎంత ఎక్కువగా లోన్ తీసుకుంటే అందులో రూ.2 లక్షలు మినహాయించి మిగిలిన డబ్బు చెల్లించాలి.
ఒక రైతు రూ.3 లక్షల రుణం తీసుకుంటే అతడు ముందుగా రూ.1 లక్ష రుణం బ్యాంకుకు చెల్లించాలి. అప్పుడు మిగతా రూ.2 లక్షల్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. వచ్చే ఏడాది మార్చి 31 లోపు అదనపు రుణం చెల్లించిన వారికి మాత్రమే ప్రభుత్వ రుణమాఫీ వర్తిస్తుంది. ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2025 వరకు రుణం తీసుకున్నవారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. 2025 మార్చి 30 నాటికి ఉన్న రుణాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే, ఈ ఏడాది మార్చి 31 లోపు రుణం చెల్లించి ఉండకూడదు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో కూడా కొత్తగా అధికారం చేపట్టిన సీఎం విజయ్.. అక్కడి రైతులకు రూ.50 వేల వరకు రుణమాఫీ ప్రకటించారు. అధికారకంగా ఏ పదవిలోనైనా ఉన్నా, లేదా రాజకీయ పదవుల్లో ఉన్నా ఈ పథకం వర్తించదు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయపు పన్ను చెల్లించేవారికి, నెలకు రూ.25,000కు పైగా వేతనం పొందుతున్న సహకార సంస్థల సిబ్బందికి కూడా రుణమాఫీ వర్తించదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
Back Pain | వెన్ను నొప్పికి అసలు కారణాలు ఏమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..
KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

