వరదలపై మహారాష్ట్ర సీఎం అత్యవసర సమావేశం..!
Uddav Thackeray: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వరద పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రత్నగిరి, రాయ్‌గఢ్ జిల్లాల్లో వరదలు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వరద పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రత్నగిరి, రాయ్‌గఢ్ జిల్లాల్లో వరదలు తీవ్ర ప్రభావం చూపడంతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఆయా జిల్లాల్లో పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ విభాగాలకు, సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీచేశారు. వరదల నేపథ్యంలో అందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని సూచించారు.
ఈ వివరాలను మహారాష్ట్ర సీఎం కార్యాలయ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. కాగా, మహారాష్ట్ర రాజధాని ముంబైని గత 24 నుంచి భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల భారీగా నిలిచిన వరదనీరు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

