ఇండ్లకు వెళ్లిపోండి
ఐటీ కారిడార్‌లో నీటి సరఫరా లేక హాస్టల్ యాజమాన్యాలు విద్యార్థులకు వారం రోజుల వరకు సెలవులు ప్రకటించాయి. హాస్టళ్లలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పాటు కరెంట్ కూడా సరిగ్గా లేకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు మంగళవారం సాయంత్రం విద్యార్థులను తమ సొంతూళ్లకు వెళ్లిపోవాలని చెప్పారు.
- హాస్టల్ యాజమాన్యాల హుకుం
మాదాపూర్, నవంబర్ 4: ఐటీ కారిడార్‌లో నీటి సరఫరా లేక హాస్టల్ యాజమాన్యాలు విద్యార్థులకు వారం రోజుల వరకు సెలవులు ప్రకటించాయి. హాస్టళ్లలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో పాటు కరెంట్ కూడా సరిగ్గా లేకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు మంగళవారం సాయంత్రం విద్యార్థులను తమ సొంతూళ్లకు వెళ్లిపోవాలని చెప్పారు. రానున్న వారం రోజుల పాటు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తామని, వెంటనే ఖాళీ చేయాలని చెప్పడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
బోర్ల వివాదమే అసలు కారణం …
మాదాపూర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇటీవల హైడ్రా అధికారులు అక్రమ బోర్లపై చర్యలు తీసుకోవడంతో ట్యాంకర్ల యజమానులు నిరసనకు దిగారు. దీంతో హాస్టల్స్‌కు నీటి సరఫరా అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరో వైపు కొంతమంది వాటర్ ట్యాంకర్లను నడుపుతున్న విషయం గమనించిన ట్యాంకర్ల యాజమానులు వాటిని అడ్డుకొని అందులో నీటిని పారపోస్తుండటంతో హాస్టళ్లకు చుక్క నీరు అందలేదు. కాగా, హాస్టళ్ల యజమానులు బుధవారం డీసీపీ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి డీసీపీకి వినతి పత్రాన్ని అందజేశారు. హైడ్రా బోర్లపై చర్యలు తీసుకోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

