న్యూఢిల్లీ: ఒకేసారి లోక్సభ, అసెంబ్లీలకు ఎన్నికలు(One Nation One Election) నిర్వహించే అంశంపై రూపొందిన జమిలి బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపాలని ఇవాళ లోక్సభ తీర్మానం పాస్ చేసింది. సభను నిరవధికంగా వాయిదా వేయడానికి ముందు రెండు బిల్లులను జేపీసీకి పంపేందుకు తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే రెండు రోజుల క్రితం జమిలి ఎన్నికల బిల్లుకు లోక్సభలో ఆమోదం దక్కిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంటరీ స్థాయి సంఘంలో ఉండే సభ్యుల వివరాలను పంపించాలని రాజ్యసభను మంత్రి కోరారు.
సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘం కమిటీలో మొత్తం 39 మంది ఎంపీలు ఉంటారు. దాంట్లో 27 మంది లోక్సభ, 12 మంది రాజ్యసభ సభ్యులు ఉండనున్నారు. మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, పీపీ చౌదరీ, ప్రియాంకా గాంధీలు లోక్సభ నుంచి ఆ కమిటీలో ఉన్నారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులపై జేపీసీలో చర్చిస్తారు. ఓ బిల్లు కోసం మాత్రం రాజ్యాంగ సవరణ అవసరమని నిపుణులు చెబుతున్నారు.
12 Rajya Sabha MPs Ghanshyam Tiwari, Bhubaneswar Kalita, K. Laxman, Kavita Patidar, Sanjay Kumar Jha, Randeep Singh Surjewala, Mukul Balkrishna Wasnik, Saket Gokhale, P. Wilson, Sanjay Singh, Manas Ranjan Mangaraj and V. Vijayasai Reddy to be part of the Joint Parliamentary…
— ANI (@ANI) December 20, 2024