న్యూఢిల్లీ, జనవరి 1: దేశంలో వాణిజ్య సిలిండర్ ధరలు స్వల్పంగా తగ్గాయి. హోటల్స్, రెస్టారెంట్లలో వాడే 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.14.5 తగ్గించారు. అలాగే విమాన ఇంధన ధర దేశ రాజధానిలో కిలో లీటర్కు రూ. 1,401.37 తగ్గి రూ.90, 455.47కు చేరుకుంది.
కాగా, వరుసగా రెండు నెలలుగా పెరుగుతూ వస్తున్న ఏటీఎఫ్ ధర మూడో నెలలో 1.5 శాతం తగ్గింది. కాగా, గృహవినియోగ వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.