గణనీయంగా తగ్గిన శబరిమల భక్తుల సంఖ్య, ఆదాయం

కొన్ని: కేరళలోని శబరిమల ఆలయానికి భారీ స్థాయిలో భక్తుల రాక తగ్గిపోయింది. దాంతో పాటు ఆదాయం కూడా పడిపోయింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భక్తుల రాకను అధికారులు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈనెలలో జరిగిన ఉత్తరమ్ వేడుకతో పాటు మీనం నెల పూజల కోసం భక్తులకు అనుమతి ఇచ్చినా.. చాలా స్వల్ప సంఖ్యలో భక్తులు ఆ కార్యక్రమాలకు హాజరయ్యారు. మార్చి 14 నుంచి మార్చి 28వ తేదీ వరకు అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరిచి ఉంచారు. ఆ సమయంలో కేవలం 25వేల మంది భక్తులు మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. నిజానికి ఆ సమయంలో సుమారు 1.5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.
ఆలయం తెరిచి ఉంచిన సమయంలో ప్రతి రోజు పది వేల మంది భక్తులకు దర్శనం కోసం అనుమతి ఇచ్చారు. కానీ దాంట్లో సగం మంది కూడా రోజువారీగా హాజరుకాలేకపోయినట్లు అధికారులు చెప్పారు. అతి స్వల్ప సంఖ్యలో భక్తులు రావడం వల్ల దేవాలయ ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. శబరిమల దేవస్థానం బోర్డు 15 రోజుల్లో కేవలం 1.25 కోట్లు మాత్రమే ఆర్జించింది. 2019లో ఇదే సీజన్లో ఆలయ బోర్డు సుమారు 16 కోట్లు ఆర్జించినట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం కోవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ ఉంటేనే భక్తులను శబరిమలకు అనుమతి ఇస్తున్నారు. ఆదాయం పడిపోవడంతో ఆలయ బోర్డు సాంప్రదాయబద్దంగా పంబా వద్ద నిర్వహించాల్సిన కొన్ని కార్యక్రమాలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. రాబోయే మీడం నెల పూజలు, విష్ణు ఉత్సవాలకు జనం అధిక సంఖ్యలో శబరిమలకు వస్తారని అధికారులు ఆశిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

