Lok Sabha Polls | లోక్‌సభ ఎన్నికల బరిలో అక్షయ్ కుమార్..? చాందినీచౌక్ నుంచి బరిలో దింపే యోచనలో బీజేపీ
Lok Sabha Polls | బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)ని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని చాందినీ చౌక్ (Chandni Chowk) నుంచి అక్షయ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
Lok Sabha Polls | లోక్‌సభ ఎన్నికలకు (Lok Sabha Polls) సమయం దగ్గరపడుతోంది. మరో పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయాత్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశాయి.
ఇక దేశరాజధాని ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. అక్కడ అధికార ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాలు ఉండగా ఆప్ నాలుగింట్లో, కాంగ్రెస్ మూడింట్లో బరిలోకి దిగబోతోంది. గత ఎన్నికల్లో ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఆప్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. కానీ, బీజేపీ సైతం ఈ ఎన్నికల్లో కూడా ఢిల్లీని క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది.
ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు ఏడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ లోక్‌సభ స్థానం నుంచి స్టార్ నటుడిని బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. స్థానికతను దృష్టిలో ఉంచుకొని బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)ని లోక్‌సభ బరిలో నిలపబోతోందని సమాచారం. చాందినీ చౌక్ (Chandni Chowk) నుంచి అక్షయ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే పార్టీ నేతలు అక్షయ్‌ను ఒకసారి సంప్రదించారని సదరు కథనాలు వెల్లడించాయి. అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.
Also Read..
Akshata Murty | బెంగళూరు వీధుల్లో బ్రిటన్ ప్రథమ మహిళ.. ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే
Virat Kohli | లండన్ కేఫ్‌లో కూతురితో కోహ్లీ.. పిక్స్ వైరల్
mohammed shami | షమీకి శస్త్రచికిత్స విజయవంతం.. ఫొటోలు షేర్ చేసిన స్టార్ క్రికెటర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

