భావనగర్: గుజరాత్లో ఓ సింహం(Gujarat Lion) గోవుల కాపరిపై పంజా విసిరి అతన్ని బంధించేసింది. ఈ ఘటన భావ్నగర్ జిల్లాలో జరిగింది. ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. గోవుల కాపరిని కింద పడేసిన ఆ సింహం.. అతని చేతులను నోట్లో పెట్టుకుని వదల్లేదు. స్థానికులు ఆ జంతువును తరిమేందుకు ప్రయత్నించినా.. సఫలం కాలేకపోయారు. పలిటానా తాలూకాలోని గారాజియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితుడిని కాలూభాయ్ పర్మార్గా గుర్తించారు.
గోవులను మేతకు తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. బహుశా ఆ సింహాన్ని రెచ్చగొట్టడం వల్ల.. భయంతో అది అటాక్ చేసి ఉంటుందని అటవీశాఖ అధికారి చిరాగ్ అమిన్ తెలిపారు. వన్య ప్రాణులు తిరిగే ప్రాంతంలో దాడి జరిగినట్లు అధికారి పేర్కొన్నారు. భావ్నగర్లో చికిత్స కోసం పర్మర్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడినట్లు అటవీ శాఖ సిబ్బంది పేర్కొన్నది.
తన చేతుల్ని కొరకడానికి ముందు ఆ సింహం తనపై పంజా విసిరినట్లు బాధితుడు చెప్పాడు. గోవులను మేపేందుకు ఉదయమే వెళ్లానని, సింహం ఆ ప్రాంతంలో కూర్చున్నట్లు గమనించామని, కానీ అది సడెన్గా అటాక్ చేసిందన్నాడు. దాదాపు అరగంట సేపు తన చేతులను సింహం నోట్లో పెట్టుకున్నట్లు చెప్పాడు. పట్టు వదిలిన తర్వాత అక్కడ నుంచి పరారీ అయినట్లు అతను తెలిపాడు.
మరో వ్యక్తిపై కూడా ఆ సింహం దాడి చేయడానికి ప్రయత్నించిందని, కానీ అతను తప్పించుకున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం అటవీ శాఖ ఆ సింహన్ని పట్టుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది.
One of the luckiest escapes….A Gujarat man survived a lion attack. A truly miraculous day for him.#Lion #Gujarat pic.twitter.com/1scIiPW3p3
— Deepu (@deepuva24) July 7, 2026