ఉత్తర భారతంపై ‘పిడుగు’.. 68 మంది మృతి
ఉత్తర భారతంపై పిడుగు | ఉత్తర భారతంపై పిడుగు పడింది. ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో పిడుగులు పడి 68 మంది

న్యూఢిల్లీ : ఉత్తర భారతంపై పిడుగు పడింది. ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో పిడుగులు పడి 68 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో సోమవారం ఉదయం వరకు భారీ పిడుగులు పడ్డాయి. దీంతో యూపీలోనే 41 మంది ప్రాణాలు కోల్పోగా, మధ్యప్రదేశ్‌లో ఏడుగురు చనిపోయారు. రాజస్థాన్‌లో పిడుగుపాటుకు 20 మంది బలయ్యారు. వీరిల ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మరో 10 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క ప్రయాగ్‌రాజ్‌లోనే 14 మంది చనిపోయారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి సానుభూతి తెలిపారు.
రాజస్థాన్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్ర్భాంతి
రాజస్థాన్‌లో పిడుగులు పడి 20 మంది చనిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇది బాధాకరమైన విషయమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్.. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.
राजस्थान के कुछ इलाकों में आकाशीय बिजली गिरने से कई लोगों को अपनी जान गंवानी पड़ी है। इससे अत्यंत दुख हुआ है। मैं मृतकों के परिजनों के प्रति अपनी गहरी संवेदना व्यक्त करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 12, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

