ఢిల్లీలో మళ్లీ ఎల్జీ వర్సెస్ ఆప్
ఢిల్లీ మహిళా కమిషన్లో పని చేస్తున్న 52 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్ట్నెంట్ గవర్నర్ సక్సేనా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆయన ఆమోదించారు.
- మహిళా కమిషన్లో 52 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ వీకే సక్సేనా నిర్ణయం
- ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్లో పని చేస్తున్న 52 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్ట్నెంట్ గవర్నర్ సక్సేనా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆయన ఆమోదించారు. దీంతో అక్రమంగా నియమితులైన కాంట్రాక్టు సిబ్బందిని తొలగిస్తున్నట్టు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కమిషన్లో 40 పోస్టులు మాత్రమే మంజూరైతే, 223 మందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారని, నియామక ప్రక్రియ కూడా సరిగ్గా జరగలేదని ఉత్తర్వుల్లో అధికారులు పేర్కొన్నారు. అయితే, 52 మందిని నియమించారని, మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ 52 మందిని విధుల నుంచి తొలగించినట్టు గురువారం పేర్కొన్నారు.
తుగ్లక్ నిర్ణయం: స్వాతి మలివాల్
లెఫ్ట్నెంట్ గవర్నర్ నిర్ణయాన్ని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ తప్పుపట్టారు. ఎల్జీ ‘తుగ్లక్’ ఉత్తర్వులు జారీ చేశారని ఆరోపించారు. కాంట్రాక్టు సిబ్బందిని తొలగిస్తే మహిళా కమిషన్కు తాళాలు వేయాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు. రక్తం, చెమట ధారబోసి మహిళా కమిషన్ను నిర్మించామని, దీనికి సిబ్బందిని, రక్షణను ఇవ్వాల్సింది పోయి పునాదుల నుంచి ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. తాను జీవించి ఉన్నన్ని రోజులు కమిషన్ను మూతపడనివ్వనన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

