టెహ్రాన్: అసలైన శత్రువుకు వ్యతిరేకంగా ఏకమవుదామని ముస్లిం దేశాలకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. ముహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఈ మేరకు తన టెలిగ్రామ్ ఖాతాలో లిఖితపూర్వక సందేశాన్ని విడుదల చేశారు. తెలిసి, తెలియక ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేవారు ఇస్లాం శత్రువులకు సహాయం చేస్తారని తెలిపారు. గల్ఫ్ ప్రజలు, ప్రభుత్వాలు ఇస్లాం ఐక్యంగా ఉంటే గుర్తింపు లేని పోకిరీలు ఆస్తులను ఆశించే ధైర్యం చేస్తారా అని గల్ఫ్ అరబ్ పాలకులను ఉద్దేశించి ఖమేనీ అన్నారు.