LeT terrorists Arrested | బారాముల్లాలో ఉగ్రకుట్ర భగ్నం.. ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదుల అరెస్ట్
LeT terrorists Arrested | జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో భద్రతా బలగాలు సోమవారం టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించారు. భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను సైతం అరెస్టు చేశారు.
LeT terrorists Arrested | జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో భద్రతా బలగాలు సోమవారం టెర్రర్ మాడ్యూల్‌ను ఛేదించారు. భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను సైతం అరెస్టు చేశారు. వారిని ఫరూఖ్ అహ్మద్ పర్రా, సైమా బషీర్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పక్కాగా అందిన సమాచారం మేరకు.. బారాముల్లా పోలీస్, ఆర్మీ 29ఆర్ఆర్, 2బీఎన్ ఎస్ఎస్బీ బలగాలు బారాముల్లా పట్టాన్ వద్ద టెర్రర్ మాడ్యుల్‌ను చేధించాయి. అదే సమయంలో లష్కరే తొయిబాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అలాగే ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక పిస్టల్, రెండు పిస్టల్ మ్యాగజైన్లు, ఐదు పిస్టల్ రౌండ్లు, పేలుడు పరికరాలు, 2 కిలోల బరువున్న ఒక రిమోట్ కంట్రోల్ ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు ఇద్దరు అబిద్ ఖయూమ్ లోన్ అనే టెర్రరిస్ట్‌తో సన్నిహితంగా పని చేసినట్లు పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇద్దరిపై పట్టాన్ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, విచారణ కొనసాగుతుందని పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

