Lesbian Couple | ఒక్కటైన లెస్బియన్ జంట.. నిశ్చితార్థం పూర్తి.. గోవాలో పెళ్లి

Lesbian Couple | ఈరోజుల్లో గే, లెస్బియన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. భారత్‌లో గే, లెస్బియన్ పెళ్లిళ్లు చట్టబద్ధం కాదు. వేరే దేశాల్లో అవి చట్టబద్ధమే. అయినప్పటికీ.. మన దేశంలో గే కల్చర్.. లెస్బియన్ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇటీవలే హైదరాబాద్‌లో గే కపుల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన లెస్బియన్ కపుల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ల ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. గత వారమే వాళ్ల నిశ్చితార్థం జరగగా.. త్వరలోనే తమ బంధువుల సమక్షంలో గోవాలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.
Maharashtra: Two women doctors in a 'commitment ring ceremony' in Nagpur last week took vows to spend their lives together as a couple
— ANI (@ANI) January 5, 2022
"We call this relationship 'lifetime commitment'. We are planning our wedding in Goa," says Paromita Mukherjee, one of the women pic.twitter.com/v4omRiLtkq
ఇద్దరూ డాక్టర్లే. ఒకరు పరోమితా ముఖర్జీ, మరొకరు సుర్బి మిత్రా. మా రిలేషన్షిప్ అనేది లైఫ్‌టైమ్ కమిట్మెంట్ లాంటిది. మా పెళ్లిని గోవాలో ప్లాన్ చేశాం. 2013 నుంచే నా గురించి మా నాన్నకు తెలుసు. మా అమ్మకు ఇటీవలే చెప్పా. ముందు తను షాక్ అయింది. ఆ తర్వాత తనూ యాక్సెప్ట్ చేసింది. నేను సంతోషంగా ఉండటమే కదా వాళ్లకు కావాల్సింది అంటూ పరోమితా ముఖర్జీ తెలిపింది.
There was never any opposition to my sexual orientation from my family. In fact, when I told my parents, they were happy. I'm a psychiatrist and many people talk to me about living a dual life because they couldn't take a stand for themselves: Surbhi Mitra in Nagpur pic.twitter.com/9CPLqhYM51
— ANI (@ANI) January 5, 2022
నా ఫ్యామిలీ ఏనాడూ నా రిలేషన్షిప్ గురించి ప్రశ్నించలేదు. నా గురించి చెప్పినప్పుడు వాళ్లు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. నేను సైకియాట్రిస్ట్‌ను. నా దగ్గరికి చాలా మంది పేషెంట్లు వస్తుంటారు. వాళ్లు తమ జీవితంలో నిలదొక్కుకోకపోవడానికి ముఖ్య కారణం.. ఏ విషయం మీద స్టాండ్ తీసుకోకపోవడమే.. నా జీవితం విషయంలో మాత్రం నాకు చాలా క్లారిటీ ఉంది.. అంటూ పరోమితా పార్ట్నర్ సుర్భి మిత్రా స్పష్టం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

