జంతువుల వీడియోలు భలే ఫన్నీగా ఉంటాయి. సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే, చెట్టుపై కోతిని చిరుతపులి వేటాడడం మీరెప్పుడైనా చూశారా? అలాంటి భయానక, అరుదైన వీడియో ఒకటి ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
అనేక వన్యప్రాణులకు నిలయంగా ఉన్న మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో ఈ అరుదైన క్లిప్‌ను చిత్రీకరించారు. ఈ వీడియోలో ఆకలితో ఉన్న చిరుతపులి చెట్టుపైకి ఎక్కి కోతిని నోటకరుచుకొని కిందికి దిగుతోంది. చెట్టు దిగుతున్నప్పుడు పులి కోతిని నోటిలో గట్టిగా పట్టుకుని కనిపించింది. పన్నా టైగర్ రిజర్వ్ అధికారిక ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూసి నెటిజన్లు భయబ్రాంతులకు గురయ్యారు.
1/n
A rare sight of a leopard hunting monkey in panna tiger reserve. pic.twitter.com/qHL81Pav75— Panna Tiger Reserve (@PannaTigerResrv) May 29, 2022