JNU : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నిక(Student Union Elections)ల్లో వామపక్ష సంఘాలు (Left Organizations) జయభేరి మోగించాయి. బీజేపీ విద్యార్థి సంఘమైన ఏబీవీపీ(ABVP)ని సున్నాకే పరిమితం చేస్తూ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేశాయి. మంగళవారం జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్ సంఘాలు మద్దతిచ్చిన అభ్యర్థులే నాలుగు సెంట్రల్ ప్యానెళ్లను గెలుచుకున్నారు. అధ్యక్ష పదవికి అదితి మిశ్రా (Aditi Mishra) ఎంపికవ్వగా.. ఉపాధ్యక్షుడిగా కీజాకుట్ గోపిక బాబు గెలుపొందారు.
జేఎన్‌యూలో విద్యార్థి సంఘాల ఎన్నికలపై ఎప్పటిలానే దేశం మొత్తం దృష్టి సారించింది. ఈసారి కూడా లెఫ్ట్ సంఘాలు, ఏబీవీపీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని భావించారు. బ్యాలెట్ విధానంలో మంగళవారం ముగిసిన ఎన్నికల్లో విద్యార్థిలోకం ఏకపక్ష తీర్పునిచ్చింది. గురువారం వెల్లడించిన ఫలతాలు లెఫ్ట్ సంఘాల ఆధిపత్యాన్ని మరోసారి చాటాయి.
Victory ✌🏾! Congratulations to Comrades Aditi-Gopika-Sunil-Danish!
The united Left panel has swept the Jawaharlal Nehru University Students Union (#JNUSU) polls overcoming stiff ABVP challenge.We wish more power to AISA and other progressive student organisations in the… pic.twitter.com/4BbViPtXuE
— CPIML Liberation (@cpimlliberation) November 6, 2025
అధ్యక్ష పదవికి పోటీ చేసిన అదితీ మిశ్రా ఏబీవీపీ అభ్యర్ధి వికాస్ పటేల్‌పై భారీ తేడాతో విజయం సాధించింది. ఆమెకు రికార్డు స్థాయిలో 1,937 ఓట్లు వచ్చాయి. 2,184 ఓట్లు సాధించిన డానిస్ అలీ (లెఫ్ట్) జాయింట్ సెక్రటరీగా, సెక్రటరీగా సునీల్ యాదవ్(లెఫ్ట్, 2,125 ఓట్లు) ఎంపికయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి యువజన విభాగమైన ఎన్ఎస్యూఐ పోటీ చేసింది. కానీ, లెఫ్ట్ సంఘాలు జోరుతో ఏబీవీపీ మాదిరిగానే ప్రధాన పోటీలో ఏ మాత్రం నిలవలేకపోయింది.