BSNL | న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ప్రముఖ టెలికం ఆపరేటర్ ‘బీఎస్ఎన్ఎల్’ ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్ సేవలు పొందుతున్న వేలాదిమంది వినియోగదారుల వ్యక్తిగత, సున్నితమైన సమాచారం హ్యాకర్ చేతికి చిక్కింది.
‘పెరెల్’ అనే పేరుతో ఓ హ్యాకర్ సదరు వినియోగదారుల వ్యక్తిగత, గుర్తింపు వివరాల్ని ‘డార్క్ వెబ్’లో అమ్మకానికి పెట్టినట్టు శనివారం మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్‌లు, కాంటాక్ట్ ఫోన్ నంబర్లు, బిల్లింగ్ వివరాలు.. మొదలైనవి హ్యాకర్ చేతికి చిక్కాయి