LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
LOC : జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు రేఖ (ఎల్ఓసీ) గుండా దేశంలో అడుగుపెట్టాలనుకున్న ఈ ముష్కర మూకలోని నలుగురు ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజిక్ డివైజ్ (ఐఈడీ) పేలుడులో హతమయ్యారు.
LOC : భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన లష్కరే తొయిబా (Lashkar -e-Taiba)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి ఆ ఉగ్రముఠా కీలక నేతల్లో ఒకరు మృత్యువును తప్పించుకోలేకపోయాడు. జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు రేఖ (ఎల్ఓసీ) గుండా దేశంలో అడుగుపెట్టాలనుకున్న ఈ ముష్కర మూకలోని నలుగురు ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజిక్ డివైజ్ (ఐఈడీ) పేలుడులో హతమయ్యారు. సోమవారం సంభవించిన ఈ పేలుడులో లష్కరే ప్రధాన నాయకుడు మొహమ్మద్ ఫైజాన్ సహా నలుగురు మరణించారు. ఎల్ఓసీ దరిదాపుల్లో చొరబాట్లను నివారించేందుకు ఏర్పాటు చేసిన మైన్స్.. ఉగ్ర కుట్రకు చరమగీతం పాడాయి.
సరిహద్దు రేఖ వెంబడి అక్రమంగా భారత్‌లో ప్రవేశించి ఉగ్రదాడులకు పాల్పడాలనుకున్న లష్కరే తొయిబాకు చెందిన ఒక బృందం కథ ముగిసింది. జమ్ముకశ్మీర్‌లో ఎల్ఓసీ గుండా చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించిన నలుగురు ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజిక్ డివైజ్ పేలుడులో హతమయ్యారు. వీరిలో లష్కరే ప్రధాన నాయకుల్లో ఒకడైన మొహమ్మద్ ఫైజాన్ ఉన్నాడు. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా.. ఎల్ఓసీకి సమీపంలోని నంగి టెక్రీకి దగ్గర్లోని కృష్ణ ఘాటి సెక్టార్ గుండా నలుగురు సభ్యులతో కూడిన లష్కరే ముఠా భారత్‌లోకి చొరబడాలనుకుంది.
An explosion, suspected to have been caused by an improvised explosive device (IED), was heard in a forward village along the Line of Control (LoC) in the Krishna Ghati sector of Jammu and Kashmir’s Poonch district on Monday, prompting heightened security measures, officials said.
An explosion by a suspected improvised explosive device (IED) was heard in a forward village along the Line of Control in the Krishna Ghati sector of Jammu and Kashmir’s Poonch district on Monday, triggering heightened security measures, officials said.
More details🔗 https://t.co/PFfbNuC5D8
Catch every update on the TOI App 👉 https://t.co/ogFaRsVinV
#Poonch #JammuAndKashmir #LoC #IEDBlast #SecurityAlert #IndianArmy
— The Times Of India (@timesofindia) October 12, 2026
కానీ, అనూహ్యంగా మందుపాతర పేలుడు ధాటికి ఆ రాక్షస బృందం తునాతునకలైంది. చొరబాటుదారులను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన మైన్స్ పేలడంతో ఫైజాన్, వకాస్, అసిమ్, ఇష్తియాక్ అనే లష్కరే ఉగ్రవాదాలు మరణించారు. పాకిస్థాన్ భూభాగం వైపున్న సరిహద్దు రేఖ నుంచి సోమవారం ఉదయం ఐఈడీ పేలుడు శబ్దం వినిపించిందని భారత సైనికాధికారులు పేర్కొన్నారు. అయితే.. అప్పుడు ఎంత మంది చనిపోయారు? ఎందరు గాయపడ్డారు? అనేది నమోదు కాలేదని వారు తెలిపారు. పేలుడు తర్వాత ఎల్ఓసీ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

