Lalu Prasad Yadav | న్యూఢిల్లీ: దేశానికి ప్రధాని కావాలనుకునేవారు భార్య లేకుండా ఉండరాదని, జీవిత భాగస్వామి లేకుండా ప్రధాని నివాసంలో ఉండటం తప్పని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
వైద్య పరీక్షల నిమిత్తం గురువారం ఢిల్లీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ బెంగళూరులో జరిగే 17 పార్టీల సమావేశంలో విపక్షాలన్నీ ఏకమవుతాయని, అవి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని తుడిచి పెట్టేస్తాయని అన్నారు.