కోల్‌కతా: నిషేధిత బాణాసంచా(banned firecrackers)ను పేల్చిన సుమారు 600 మందిని కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన 24 గంటల్లో ఆ అరెస్టులు జరిగాయి. సుమారు 700 కేజీల నిషేధిత బాణాసంచాను పోలీసులు సీజ్ చేశారు. వాటితో పాటు 80 లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించిన 800 మందిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం రోజున కోల్‌కతాలో కాళీ పూజతో పాటు దీపావళి సంబరాలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారుజామున ఏడు గంటల వరకే బాణాసంచా పేల్చిన 265 మంది, అనుచితంగా ప్రవర్తించిన 328 మందిని, గ్యాంబ్లింగ్ ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కోల్‌కతా పోలీసులు వెల్లడించారు. 296 మంది బైకర్లు, 93 మంది హెల్మెట్‌లేని పిలియన్ రైడర్లు, 93 మంది ర్యాష్ డ్రైవింగ్, 90 మంది డ్రంకన్ డ్రైవింగ్ కింద అరెస్టు చేశారు.