ఛండీగఢ్: దేశంలో సహజీవనాలు, స్వలింగ వివాహాలపై నిషేధం విధించాలని దాదాపు 300 ఖాప్ పంచాయత్‌లు డిమాండ్ చేశాయి. ఇందుకోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించాయి. ఆదివారం హర్యానాలోని జింద్‌లో మహాపంచాయత్ జరిగింది. హర్యానా, యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఖాప్ పంచాయత్‌ల సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.