న్యూఢిల్లీ: చికెన్ అనే పదంపై కేఎఫ్‌సీ సంస్థ ప్రత్యేక హక్కులను క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. ‘చికెన్ జింజర్’ అనే పదానికి సంబంధించి ట్రేడ్‌మార్క్ కోసం కేఎఫ్‌సీ చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురికావడంతో ఆ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. చికెన్ జింజర్పై ట్రేడ్‌మార్క్ కోసం మూడు నెలల్లో అభ్యంతరాలను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేయాలని ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీకి ఢిల్లీ హైకోర్టు సూచించింది. చికెన్ అనే పదంపై కేఎఫ్‌సీకి ఎలాంటి ప్రత్యేక హక్కులు ఉండవని, ఈ విషయాన్ని ప్రకటనలోనూ పొందుపర్చాలని కోర్టు పేర్కొంది.