కేరళకు చెందిన 19 ఏండ్ల న్యాయ శాస్త్ర విద్యార్థిని, మోడల్ కాజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా-2026 కిరీటాన్ని సొంతం చేసుకున్నది. జైపూర్లో ఆదివారం జరిగిన పోటీలో 52 మంది పోటీదారులను ఓడించి ఆమె ఈ విజయాన్ని దక్కించుకొన్నది.
నవంబర్లో పోర్టోరికోలో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో ఆమె భారత్కు ప్రాతినిథ్యం వహిస్తారు.