Civil Services results | మృత్యు ముఖం నుంచి అత్యున్నత సర్వీసుకు.. వీల్‌ఛైర్‌పైనే ప్రిపరేషన్!
Civil Services results | సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో మెరుగైన ర్యాంక్ వచ్చిందని హాస్పిటల్ బెడ్‌పై షెరిన్ షహనాకు తెలియడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.
Civil Services results | తిరువనంతపురం : సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో ర్యాంక్ వచ్చిందని హాస్పిటల్ బెడ్‌పై షెరిన్ షహనాకు తెలియడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. కేరళలోని వయనాద్‌కు చెందిన పాతికేండ్ల షహన ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో భుజానికి గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సివిల్స్‌లో టాప్ ర్యాంక్ రాకున్నా షెరిన్‌కు 913వ ర్యాంకు రావడం కూడా ఆషామాషీగా వచ్చినదేం కాదు.
చావును చూసే ప్రమాదాలను ఎదురొడ్డి తల్లి, సోదరి సాయంతో ఇంతవరకూ వచ్చింది. 2017లో ఆమె తన ఇంటి టెర్రేస్‌పై ఆరిన బట్టలు తీస్తుండగా అక్కడి నుంచి కిందపడటంతో ఆమె ప్రపంచం తలకిందులైంది. దీంతో ఆమె వెన్నుకు తీవ్ర గాయం కాగా, ఆమె భుజాలు, దిగువ శరీరభాగాలు కదలలేని స్ధితికి చేరాయి. నిలువెల్లా గాయాలతో రెండేండ్ల వరకూ ఆమె మంచానికే పరిమితమైంది. 2015లో తండ్రిని కోల్పోవడంతో షహనాకు సరైన చికిత్స అందించలేకపోయారు.

తల్లి, సోదరి జలిషా ఉస్మాన్ ప్రోత్సహంతో షహనా తన సివిల్ సర్వీస్ కలను వదులుకోకుండా వీల్‌ఛైర్‌పైనే పరీక్షలకు సిద్ధమైంది. తన మెమరీని కోల్పోయిన షహనా ఆపై లెటర్స్ నుంచి తన ప్రస్ధానం మొదలుపెట్టింది. ఆన్లైన్లో చదువుతూ నెట్, పొలిటికల్ సైన్స్‌లో జేఆర్ఎఫ్ను క్లియర్ చేసింది.

కాలికట్ యూనివర్సిటీ నుంచి ప్రస్తుతం పీహెచ్డీ చేస్తోంది. సివిల్ సర్వీసెస్‌కు పోటీ పడే దివ్యాంగుల కోసం ఆబ్సల్యూట్ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్‌కు రెండేండ్ల కిందట షహనా ఎన్రోల్ అవడంతో ఆమె సివిల్స్ కల సాకారమైంది. మళయాళంలో సివిల్స్‌ను అటెంప్ట్ చేసిన షహనా రచయిత సాయంతో ఎగ్జామ్‌ను క్లియర్ చేసింది.
Read More
Kandula Sai Varshith: వైట్‌హౌజ్‌పై ట్రక్కుతో సాయి వర్షిత్ ఎందుకు దాడి చేయాలనుకున్నాడు?
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Civil service
- Exams
- Kerala
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Peptides | అమెరికా ఆరోగ్య రంగంలో కీలకమార్పు.. పెప్టైడ్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్.. ఏంటివి.. ఎలా పనిచేస్తాయి..?
Illegal Arrest | బీఆర్ఎస్ నాయకుడు బాలరాజు యాదవ్ అక్రమ అరెస్ట్
OPPO Smart Phone | ఒప్పో నుంచి బ్యాటరీ బాంబ్.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్!
Supreme Court: 3 రాష్ట్రాల మధ్య 60 ఏళ్లుగా విద్యుత్తు వివాదం.. పరిష్కరించిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

