Crime News | కేరళలో దారుణం.. తల్లిని, తమ్ముడిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టి..!
Crime News | కేరళ (Kerala) లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లిని, సోదరుడిని ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్య చేసి, వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. నెలరోజుల క్రితం ఇడుక్కి జిల్లా (Idukki District) లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Crime News : కేరళ (Kerala) లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లిని, సోదరుడిని ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్య చేసి, వారి మృతదేహాలను ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. నెలరోజుల క్రితం ఇడుక్కి జిల్లా (Idukki District) లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పొన్నూట్టిల్ కుటుంబానికి చెందిన సజీ (45).. తన తమ్ముడు రెజీ (40), తల్లి మేరీకుట్టి (65) తో కలిసి నివసిస్తున్నాడు. ఆ కుటుంబానికి చెందిన సుమారు ఎకరం భూమిని పంచుకోవడంపై సోదరుల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది.
ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఓ రాత్రి రెజీ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ సందర్భంగా అన్నదమ్ములు ఇద్దరికీ గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో రెజీ ముఖంపై సజీ తీవ్రంగా దాడి చేశాడు. అతను స్పృహ కోల్పోయిన తర్వాత టవల్‌తో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ హత్యను చూసిన తన తల్లి మేరీకుట్టిని కూడా ముఖంపై కొట్టి, ఊపిరాడకుండా చేసి చంపేశాడు. రెండు రోజుల పాటు మృతదేహాలను ఇంట్లోనే దాచిపెట్టి, ఆ తర్వాత ఇంటి ఆవరణలోనే గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు.
ఈ హత్యలు చేయడంలో తనకు ఎవరూ సహాయం చేయలేదని, ఒక్కడినే ఈ ఘాతుకానికి పాల్పడ్డానని సజీ పోలీసుల ఎదుట అంగీకరించాడు. నెల రోజుల నుంచి మేరీకుట్టి, రెజీ కనిపించకపోవడంతో సజీని ఆరాతీశారు. అయితే సజీ వారికి పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దాంతో అనుమానించి ఇరుగుపొరుగు అనక్కరలో ఉండే వారి సోదరి సనీకి సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సజీ ఇంటికి వెళ్లాడు. పోలీసులను చూడగానే సజీ పారిపోయాడు.
దాంతో అనుమానించిన పోలీసులు ఇంటి ఆవరణను పరిశీలించారు. తవ్వి పూడ్చిన ఆనవాళ్లు కనిపించడంతో తిరగతోడించగా రెజీ, మేరీకుట్టి మృతదేహాలు బయటపడ్డాయి. అనంతరం నిందితుడి కోసం తీవ్రంగా గాలించి ఈ నెల 28న అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కాగా 2018లో సజీ తండ్రి మాథ్యూ కూడా అదృశ్యమయ్యాడు. దాంతో ఆ ఘటనతో ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా..? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

