Kerala Governor | విద్యార్థుల నుంచి నిరసన సెగ.. కేరళ గవర్నర్‌కు భద్రత పెంపు
Kerala Governor | కేరళ గవర్నర్ (Kerala Governor) ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Arif Mohammed Khan)కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది.
Kerala Governor | కేరళ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం ఉదయం గవర్నర్ (Kerala Governor) ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Arif Mohammed Khan)కు నిరసన సెగ తగిలింది. యూనివర్సిటీ ఛాన్సెలర్ల నియామకానికి గవర్నర్ అడ్డుపుల్ల వేస్తున్నాడంటూ SFI ఆందోళనకారులు కొల్లామ్‌లో గవర్నర్ కాన్వాయ్కి అడ్డుతగిలారు. దాంతో ఆగ్రహించిన గవర్నర్ కారు దిగి ఆందోళనకారుల వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసుల తీరును గవర్నర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గవర్నర్ భద్రతను పెంచింది. రాజ్‌భవన్, గవర్నర్‌కు జెడ్ ప్లస్ భద్రత (Z Plus security)ను కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
కేరళలో అక్కడి ప్రభుత్వానికి, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ కేవలం 78 సెకన్లు మాత్రమే ప్రసంగించారు. ప్రభుత్వం ఇచ్చిన 60 పేజీల ప్రసంగాన్ని చదవకుండా పక్కనపడేశారు. దాంతో రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోమ్‌ను పినరయి విజయన్ సర్కారు బహిష్కరించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం ఉదయం SFI ఆందోళనకారులు కొల్లామ్‌లో గవర్నర్ కాన్వాయ్కి అడ్డుతగిలారు. యూనివర్సిటీ ఛాన్సెలర్ల నియామకానికి గవర్నర్ అడ్డుపుల్ల వేస్తున్నాడంటూ నల్లజెండాలు ప్రదర్శించారు. దాంతో ఆగ్రహించిన గవర్నర్ కారు దిగి ఆందోళనకారుల వైపు దూసుకెళ్లారు. దాంతో గవర్నర్ రక్షణగా పోలీసులు హ్యూమన్ షీల్డ్ ఏర్పాటు చేశారు. గవర్నర్‌ను తిరిగి కారులోకి రావాలని విజ్ఞప్తి చేశారు.
కానీ గవర్నర్ అందుకు నిరాకరించారు. పోలీసుల వైఫల్యంవల్లే SFI కార్యకర్తలు తన కాన్వాయ్కి అడ్డుతగిలారని మండిపడ్డారు. తన కాన్వాయ్ వెళ్లే మార్గంలో SFI ఆందోళనకారులను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఇలాగే అనుమతిస్తారా..? అని నిలదీశారు. పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే రోడ్డు పక్కన ఉన్న చాయ్ దుకాణం ముందు బైఠాయించారు. ఆందోళకారులపై చర్యలు తీసుకునే వరకు తాను ఇక్కడి నుంచి కదిలేదే లేదని తేల్చిచెప్పారు.
దాంతో పోలీసులు ఘటనకు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేశామని గవర్నర్‌కు చెప్పారు. తన కాన్వాయ్కి 50 మందికి పైగా అడ్డుతగిలితే 12 మందినే ఎందుకు అరెస్ట్ చేశారని ఆయన ప్రశ్నించారు. మిగతా వాళ్ల సంగతేమిటని మండిపడ్డారు. ఆందోళనకారుల అరెస్ట్‌లకు సంబంధించి FIR కాపీలు చూపించాలని అన్నారు.
Also Read..
Mallikarjun Kharge | ఇండియా కూటమికి బీటలు.. ఏం జరుగుతుందో చూద్దాం అన్న మల్లికార్జున ఖర్గే
Mamata Banerjee | పెండింగ్ నిధులు వారంలోగా చెల్లించాలి.. మోదీ సర్కార్‌కు మమతా బెనర్జీ అల్టిమేటం
Nitish Kumar | ముఖ్యమంత్రి పదవికి నేడు రాజీనామా చేయనున్న నితీశ్ కుమార్..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

