Kerala CM | రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్లపై కేరళ సీఎం అభ్యంతరం
Kerala CM : కేరళలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలు సరైనవి కాదని, వీటి అమలు కష్టమని సీఎం పినరయి విజయన్ అన్నారు.
Kerala CM : కేరళలోని రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాలు సరైనవి కాదని, వీటి అమలు కష్టమని సీఎం పినరయి విజయన్ అన్నారు. కేరళలో రేషన్ వ్యవస్ధ దీర్ఘకాలంగా ఉందని, గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ ప్రభుత్వం నూతన ప్రచార పోకడను చేపట్టడం అభ్యంతరకరమని చెప్పారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద పనిచేస్తున్న రేషన్ పంపిణీ వ్యవస్ధను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం సరైంది కాదని విజయన్ కేరళ అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రచారం కోసమే మోదీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందనేది సుస్పష్టమని అన్నారు. ఈ తరహా ప్రచారం సరైంది కాదని తన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తుందని, ఇలా చేయడం కష్టమని కూడా వివరిస్తామని తెలిపారు.
రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ పోస్టర్లు, బ్యానర్లు ఏ్పాటు చేయాలని, ఆహారోత్పత్తులతో కూడిన క్యారీ బ్యాగ్‌లపై కేంద్ర ప్రభుత్వం లోగోలను ముద్రించాలని కూడా ఎఫ్‌సీఐతో పాటు కేరళ ఆహార శాఖకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 550 రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి సెల్ఫీ పాయింట్లను నెలకొల్పాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి వెల్లడించారు.
Read More :
Deputy Chief Ministers: డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ వ్యతిరేకం కాదు: సుప్రీంకోర్టు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

